ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాములు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం వ్యవసాయ వరికోత మడులలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని  వీచిన గాలులకు ముత్తారం, అరకండ్ల గ్రామాలకు వ్యాపించి, గడ్డివాములు దగ్ధమై కాలనీలో దట్టమైన పొగలు కమ్ముకొని పిల్లలు, పెద్దలు తీవ్రమైన శ్వాస ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల పొడవునా ధారాళంగా వ్యాపించి కాలనీలలోకి మంటలు వ్యాపించసాగాయి. సమాచారం అందుకున్న  బ్లూ కోల్డ్ పోలీసులు  హెడ్ కానిస్టేబుల్ రామచంద్రం వెంటనే ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ రావడానికి ఆలస్యం జరిగింది. దీంతో మంటలు  కాలనీలోకి ప్రవేశిస్తుండగా అప్రమత్తమైన యువకులు, కాలనీవాసులు వ్యవసాయ బావుల మోటార్ల సహాయంతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చారని, దీనికి వర్షం తోడై, పెను ప్రమాదం తప్పిందని  స్థానికులు తెలిపారు.
Spread the love