బోడుప్పల్ నగర పాలక సంస్థలో రూ.30 లక్షల అవినీతిపై చర్యలు తీసుకోవాలి

– బీఆర్ఎస్ కార్పోరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ డిమాండ్
నవతెలంగాణ-బోడుప్పల్: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో జరిగిన అవినీతిపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు విడుదల చేసి ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల నుండి వసూళ్లు చేసిన వివిధ రకాల పన్నుల ద్వారా వచ్చిన రూ.30 లక్షల నగదును బ్యాంకులో జమచెయకుండా నాలుగు నెలల పాటు వాడుకొని మళ్ళీ తిరిగి రికవరీ చేశారని ఇలాంటి సంఘటనలు గతంలో అనేక సార్లు జరిగాయని ఆధారాలతో సహా గతేడాది మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని అయిన ఏలాంటి విచారణ జరపలేదని వాపోయారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్న కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిపై  విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పడతం లోకేష్, పోతుల మల్లేష్, కొండ రామచందర్ పాల్గొన్నారు.
Spread the love