రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు..

– కొనుగోలు కేంద్రాలను తనిఖీలు  నిర్వహించిన
– భూపాలపల్లి  జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – మల్హర్ రావు
కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంలటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం మండలంలోని కొయ్యుర్, కొండంపేట,ఇప్పలపల్లి  గ్రామాల్లో పిఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో భాగంగా గన్ని సంచుల, సుతిల్ కొరత ఉందని కాంటాలు పెట్టడంలో నిర్లక్ష్యం, తుకంలో తరుగు,నిబంధనలకు విరుద్ధంగా బస్తాకు 40కిలోల 700 గ్రాములు మాత్రమే అదికూడా ఎలక్ట్రానిక్ కాంటాలతో మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love