ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి  గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

–  కాంగ్రెస్ భువనగిరి ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 
నవతెలంగాణ – చండూరు  
మునుగోడు  నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి   గెలుపే లక్ష్యంగా ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి వెళ్లి  ప్రచారం చెయ్యాలని  భువనగిరి ఎన్నికల ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ  నేతలకు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ పరిధిలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన  కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త ల సమావేశం లో చండూరు మండలం, మున్సిపాలిటీ గట్టుప్పల్  మండలాల బూత్ లెవెల్  సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలకు ఓటు వేస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తారని, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు అభివృద్ధి చేసింది, ఒరిగింది.  ఏమిలేదని గుర్తు చేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఏకైక లక్ష్యంతో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు ఈ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక మేనిఫెస్టో ఐదు న్యాయ అంశాలు, తెలంగాణ ప్రభుత్వం ఆరుగ్యారంటీల పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో నాయకులు కార్యకర్తలు విశితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ  పున్న కైలాస్ నేత, మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం, పట్టణ అధ్యక్షులు  అనంత చంద్రశేఖర్ గౌడ్,  దోటి వెంకటేష్ యాదవ్, గట్టుప్పల్ మండల అధ్యక్షులు   నామని జగనాదం, ఎంపీటీసీ పల్లె   వెంకన్న, కోడి శ్రీనివాసులు,  కావలి ఆంజనేయులు,  కోడి గిరిబాబు,గండూరి జనార్ధన్, నల్లగంటి మల్లేష్, మండల ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాలు పాల్గొన్నారు.
Spread the love