రెండవ భద్రాద్రి కా పేరుగాంచిన మిర్యాల..

– ఆకాశమంత గాలిగోపురం మహాభారత రామాయణ  యుద్ధ విశేషాలను కల్పించే శిల్పాలు
– ఏర్పాట్లు పూర్తి దేవాలయ కార్యనిర్వాహణ అధికారి కుశలయ్య
నవతెలంగాణ- నూతనకల్
రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన కలిగిన మండల పరిధిలోని మిర్యాల సీతారామచంద్ర స్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే గొప్ప ఆధ్యాత్మిక దేవాలయంగా విరాజిల్లుతుంది గత ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడ్డ ఆలయ ప్రతిష్ట వైభవం ప్రజాదారణ స్వరాష్ట్ర పాలనలో నూతన జిల్లాలో అభివృద్ధికి పురుడుపోసుకుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్  సుమారు 11 లక్షల 95 వేల నిధులు కేటాయించి ఆలయం చుట్టూ సి సి రోడ్డు నిర్మాణం ఆలయంలో   గదుల పునర్నిర్మాణం చేయడంతో ఆలయ పరిసరాలు అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పూర్వ వైభవానికి సిద్ధమవుతుంది, శ్రీరామ నవమి ,సందర్భంగా పది రోజుల పాటు ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కళ్యాణ మహోత్సవానికి సూర్యాపేట నల్లగొండ ఖమ్మం వరంగల్ మహబూబాద్ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఆలయ విశిష్టత, పూర్వం ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది శ్రీ రాముడు కైకేయి కోరిక మేరకు అయోధ్యను వదలి సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళుతుండగా ప్రస్తుత ఆలయ ప్రాంగణంలో కొంత సేపు సేద తీరాడని అని ప్రచారంలో ఉంది. అందువల్ల ఎక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుండి నేటి వరకు ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ధ్వజారోహణం సందర్భంగా వేసి గరుడ  ముద్దు ను ఆరగించిన మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని, భక్తులు వెంటనే కోరికలు తీరుతాయని వారి నమ్మకం, ప్రత్యేక ఆకర్షణగా గాలిగోపురం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల లోనే,ఎత్తైన గాలిగోపురం లలో ఒకటైన ఈ గోపురం 1942లో కాస రంగయ్య నిర్మించిన ఈ ఆలయం లో గొప్ప శిల్పకళా సంపద ఉంది 52 అడుగుల ఎత్తు కలిగి ఉన్న భారీ గాలిగోపురం ఈ ఆలయ విశిష్టత చెప్పుకుంటున్నారు గాలిగోపురం పై రామాయణం మహాభారతం ఇతివృత్తాలను యుద్ధాలు చేసే సంఘటనలను తెలియజేసే శిల్పకళ ను కలిగిన  ఉండటం ఈ గాలి గోపురం యొక్క ప్రత్యేకత కోనేరు 1942 వ సంవత్సరంలో ఆలయానికి చెందిన కోనేరును  దాదాపు 50 అడుగుల లోతు రాతి కట్టడంతో మెట్లు కట్టారు అందులో ఇప్పటికీ నీరు ఉండడం విశేషం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించి, కళ్యాణ మహోత్సవం పట్టు వస్త్రాలను ప్రభుత్వం అధికారికంగా అందించాలి ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన మిరియాల సీతారామచంద్రస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనీ ప్రజలు కోరుతున్నారు, కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి, దేవాలయ కార్య నిర్వహణ అధికారి కుశలయ్య, సుమారు ఆరు జిల్లాల నుండి వచ్చే భక్తులకు అన్ని మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు మంగళ వారం అంకురార్పణ, బుధవారం హోమం, ధ్వజారోహణ, కళ్యాణం, గురువారం రథోత్సవం, పూర్ణాహుతి, బండ్ల తిరుగుడా శనివారం పొన్న సేవ, ఏకాదశ సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని భక్తులను కోరారు.

Spread the love