అదానీ- హిండెన్‌బర్గ్‌ వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ – ఢిల్లీ: అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌  ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే.  ఈ తరుణలో అదానీ- హిండెన్‌బర్గ్‌ వివాదం విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.  దీనికి సంబంధించి సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని వెల్లడించింది. అలాగే మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.

Spread the love