భారత వృద్ధి 6.7 శాతంగా ఉండొచ్చు : ఏడీబీ

భారత వృద్ధి 6.7 శాతంగా ఉండొచ్చు : ఏడీబీన్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.7 శాతం పెరగొచ్చని ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. ఇంతక్రితం సెప్టెంబర్‌లో 6.3 శాతంగా అంచనా వేసింది. గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలో 7.6 శాతం వృద్ధి చోటు చేసుకోవడంతో ఏడీబీ తన అంచనాలను సమీక్షించింది. 2024-25లోనూ 6.7 శాతం వృద్ది ఉండొచ్చని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయాలు పెరగడం, ప్రయివేటు వినిమయం పుంజుకోవడం తదితర అంశాలు జీడీపీకి మద్దతు చేయవచ్చని ఏడీబీ విశ్లేషించింది.

Spread the love