బీఆర్‌ఎస్‌లో చేరికలు

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కంచర్ల కష్ణారెడ్డి సమక్షంలో పట్టణంలోని 19వ వార్డు ఇంచార్జి పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్ధన్‌ రావు ఆధ్వర్యంలో 50 మందికి పైగా యువకులు తమ కుటుంబాలతో సహా కాంగ్రెస్‌ పార్టీ నుండి బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.కంచర్ల కష్ణారెడ్డి వారందరికీ గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణ అభివద్ధిని కాంక్షించే వారంతా బిఆర్‌ఎస్‌ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని కారు గుర్తుపై ఓటు వేసి మళ్లీ రెండోసారి కంచర్ల భూపాల్‌ రెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన బుషిపాక నరసింహ, తుంగపహాడ్‌ గ్రామానికి చెందిన నేతళ్ల సత్తయ్య అనారోగ్యంతో మతి చెందారు. విషయం తెలుసుకున్న నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి మతుల గహాలకు వెళ్లి మతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మతుల కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఇరువురి కుటుంబ సభ్యులకు చెరో రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి సర్పంచ్‌ బుషిపాక లీలప్రియ నాగేష్‌, తుంగపహాడ్‌ సర్పంచ్‌ దండిగ అలివేలు నరసింహ, వడ్డేపల్లి మాజీ సర్పంచ్‌ వట్టి కోటి సుధాకర్‌, ఎంపీటీసీ సరిత కిరణ్‌, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు గజ్జేల గెల్వాల్‌రెడ్డి, చలమల నరేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు జెట్టబోయిన శ్రీశైలం, చాపల యాదయ్య, నేతళ్ళ నరేష్‌, నేతళ్ళ కొండలు, నరసింహ, పుల్కరం యాదయ్య, నేతళ్ల భిక్షం, కుమార్‌, వడ్లకొండ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love