నవీపేట్ లో ఘనంగా ఆదివాసి దినోత్సవం

నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని తడగాం కాలనీలో నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేకల నర్సయ్య మాట్లాడుతూ ఆదివాసి లంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరాం, ప్రకాష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love