రెండు నెలలుగా విద్యకు నోచుకోని కరగ్ ప్రభుత్వ పాఠశాల..

డిప్టేషన్ పేర్లతో టీచర్లు వెళ్లకుండా కాలయాపన చేస్తున్న విద్యాశాఖ అధికారులు,
– మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన,
– చిన్నతడు ప్రభుత్వ పాఠశాలలో మూడు రోజులుగా టీచర్ లేక ఆ గ్రామ కార్యదర్శి విద్యా బోధన,
– మూతబడ్డ పాఠశాల గురించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళా సర్పంచ్,
– విద్య బోధనపై పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం కుంటుపడుతున్న చదువులు,
– ఇరు గ్రామాలను సందర్శించిన నవతెలంగాణ విలేఖరి పరిశీలనలో వెల్లడి,
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని మహారాష్ట్రకు పూర్తిగా సరిహద్దులో గల చిన్నతడుగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఖరగ్, చిన్న తడగూర్ గ్రామాలను నవ తెలంగాణ మంగళవారం నాడు సందర్శించి పాఠశాలల విద్యా బోధనపై పరిశీలించగా ఖరగ్ పాఠశాల గత రెండు నెలలుగా మూతపడే ఉంటుందని ఏ ఒక్క ఉపాధ్యాయుడు విద్యా బోధనకు రావడంలేదని ఆ గ్రామానికి చెందిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చిన్న తడుగూరు గ్రామంలో గల పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడు గత మూడు రోజులుగా పాఠశాలకు రావడం లేక ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి మాధవరావు పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారు. మద్నూర్ మండలంలోని మహారాష్ట్రకు పూర్తిగా సరిహద్దులో గల  చిన్నతడుగూరు గ్రామపంచాయతీ పరిధిలో కరగ్ పాఠశాల గత రెండు నెలలుగా విద్యాబోధనకు నోచుకోవడం లేక ఆ గ్రామ ప్రజలు మా పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి మా గ్రామానికి ఆటోలు రావు బస్సులు రావు దూరప్రాంతాలకు చదువుల కోసం వెళ్లాలంటే చిన్నపిల్లలు చదువులకు పంపాలంటే రాకపోకలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూతపడ్డ పాఠశాల విద్య బోధన గురించి ఆ గ్రామ సర్పంచ్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు మండల విద్యాశాఖ అధికారి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కాలు స్వీకరించడం లేదని సర్పంచ్ కుటుంబ సభ్యులు తెలిపారు మూతబడ్డ పాఠశాల గురించి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మద్నూర్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ కు వివరణ కోరగా జూలై మాసంలో సంతోష్ అనే ఉపాధ్యాయునికి కరగ్ పాఠశాలకు డిప్టేషన్పై ఆర్డరు జారీ చేయడం లేదని వివరణ ఇచ్చారు. జూలై మాసంలో డిప్టేషన్ పై పంపిన ఉపాధ్యాయుడు అసలే వెళ్లడం లేదు అంతకుమునుపు జూన్ మాసంలో ఏ టీచర్ ని అక్కడికి పంపారు అని కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ను ప్రశ్నించగా దానికి సరైన వివరణ ఇవ్వలేకపోయారు. మద్నూర్ మండలంలో మహారాష్ట్ర సరిహద్దులో గల చిన్నతడుగురు గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలల దుస్థితి నవతెలంగాణ పరిశీలనలో తేటతెల్లమైంది విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల పట్టింపు లేకపోవడం ఈ మండలంలోని మారుమూల గ్రామాల చదువులు పూర్తిగా కుంటుపడుతున్నాయి పాఠశాలలు మూతపడ్డ పట్టించుకునే నాధుడే లేక ప్రాథమిక చదువుల విద్యార్థిని విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి నెలకొంది పాఠశాలల విద్యా బోధన పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యమే వహిస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం అవుతుంది మూతపడే పాఠశాలల పట్ల డిప్టేషన్ లపై కాలయాపన చేస్తున్న విద్యాశాఖ అధికారుల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి మూతబడ్డ కరగ్ పాఠశాలను వెంటనే తెరిపించి ఆ గ్రామ చిన్నారి పిల్లలకు విద్యాబోధనందే విధంగా ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని మారుమూల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Spread the love