Monday, June 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదివాసీ పర్దాన్ సమాజ్ ఐక్యతకు కలిసి కట్టుగా ముందుకు సాగాలి

ఆదివాసీ పర్దాన్ సమాజ్ ఐక్యతకు కలిసి కట్టుగా ముందుకు సాగాలి

- Advertisement -

మహారాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి
అశోక్ ఉయికే
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
ఆదివాసీ పర్దాన్ సమాజ్ ఐక్యత కోసం అందరు కలిసికట్టుగా ముందుకుసాగాలని, అప్ప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని మహారాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అశోక్ ఉయికే అన్నారు. అన్ని రంగాల్లో వెనకబడిన ఆదివాసీ ప్రజలు తమ పిల్లలను చదివిస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ఆదివాసీ పర్దాన్ సమాజ్ రాష్ట్ర మహా సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. జిల్లాకేంద్రానికి వచ్చిన మహారాష్ట్ర మంత్రికి స్థానిక సమాజ్ నేతలు ఆదివాసీ గుస్సాడీలతో ఘనంగా స్వాగతం పలికి గ్పుమాలతో సత్కరించారు. అనంతరం కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అక్కడి నుండి ఎస్టీయూ భవన్ వరకు ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాల నడుమ చేపట్టిన ర్యాలీలో మంత్రితోపాటు పర్దాన్ సమాజ్ నేతలు సభస్థలికి చేరుకు న్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వ లన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించిన వారితోపాటు రాజకీయాల్లో రాణిస్తున్నవారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అశోక్ ఉయికే మాట్లాడుతూ.. పర్దాన్ సమాజంలో రాజకీయ ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉండటం కారణంగా ఆశించినస్థాయిలో రాణించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని పిల్లలం దరూ ఉన్నత శిఖరాలను అధిరో హించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎక్కడా ఎన్నికలు లేవని, తాను ఎన్నికల ప్రచారం కోసం రాలేదని, సమాజ అభి వృద్ధిని కాంకిస్తూ తెలంగాణలో నిర్వ హించిన సమ్మేళనానికి హాజరై సమాజ్ ప్రజలను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పర్ధాన్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు దుర్వ నగేష్, జిల్లా అధ్యక్షులు గోడం గంగారాం, నాయకులు కోవ మనో హర్, గేడం తులిదాస్, గేడం వనిత, గేడం గీత, మంత్రి ఓఎస్‌ఓ ఉయిక హంరాజ్, గంగాధర్ టేకం, హీరసుక జాన జా‌గృతి నాయకులు సిడాం రాంకిషన్, సిడాం రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -