Monday, June 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలు

గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలు

- Advertisement -

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఎంతో
దోహదం : వైద్యారోగ్య శాఖ మంత్రి 
దామోదర రాజనర్సింహ
మెదక్‌‌ జిల్లా వెల్దుర్తిలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం ప్రారంభం
నవతెలంగాణ-వెల్దుర్తి

గ్రంథాలయాలు మేధాశక్తికి, జ్ఞానానికి నిలయాలని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆర్‌ఆ‌ర్‌ఆర్ కోల్‌కత్తా వారి ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో నిర్మించిన గ్రంథాలయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సువాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజక వర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రంథాలయాల ద్వారా అందరూ జ్ఞానాన్ని ఆర్జించవచ్చన్నారు. ఉద్యోగాల కోసం పోటీపడే విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న 6 పడకలను 30 పడకలకు పెంచాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంత్రికి వినతి పత్రం అందజేశారు. పీహెచ్‌సీలో ఏఎన్‌ఎం, స్లీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మండల కేంద్రానికి చెందిన పానుగంటి మైసయ్య శనివారం చిన్నశంకరంపేట మండలం ధర్పల్లి గ్రామ శివారులో పిడుగు పడి ‌మృతి చెందగా.. మృతుని భార్య లక్ష్మి తమ కుటుంబ పరిస్థితి గురించి మంత్రికి విన్నవిస్తూ కన్నీటి పర్యంతమయ్యింది. వెంటనే స్పందించిన మంత్రి.. పూర్తి వివరాలు పంపించాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, నాయకులు సుధాకర్ గౌడ్, తలారి మల్లేష్, నరసింహారెడ్డి, వెల్దుర్తి సింగిల్ విండో డైరెక్టర్ కఅష్ణ గౌడ్, వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -