పార్టీ కార్యాలయాలు..
భవిష్యత్ తరాల కేంద్రాలు :
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్
శంషాబాద్‌లో బీజేపీ జిల్లా రూరల్ కార్యాలయం ప్రారంభం
మరో ఎనిమిది జిల్లాల్లో వర్చువల్‌గా ప్రారంభం
నవతెలంగాణ-శంషాబాద్
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన పద్ధతిలోనే తెలంగాణలో కూడా వస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా రూరల్ బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. దీంతోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట్, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పార్టీ జిల్లా కార్యాలయాలను శంషాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాలూ బీజేపీ మయం అయ్యాయని తెలిపారు. పార్టీ కార్యాలయాలు అంటే ఇటుక గోడలు కాదని, అది పార్టీకి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండి అభివృద్ధిలో కీలకంగా మారాలని సూచించారు. పార్టీ కార్యాలయాలు అంటే భవిష్యత్ తరాల కేంద్రాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశ్రాంతి విరామం లేకుండా రానున్న రోజుల్లో భోగాలను పక్కనపెట్టి త్యాగాలు చేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి రాష్ట్ర కమిటీ కృషి చేయాలని తెలిపారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రంగారెడ్డి జిల్లా రూరల్ పార్టీ అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్, బొక్క నరసింహారెడ్డి, చింతల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోనూ వస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



