– మండల ఎంపీటీసీల కోరం ఉన్నప్పటికీ అధికారులు రాకపోవడంతో మండల సభ వాయిదా
– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల సర్వసభ్య సమావేశం ఎంపీటీసీ కోరం ఉన్నప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఈ మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు తెలిపారు. గురువారం ఎంపీడీవో బాలరాజు తో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. గురువారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు పూర్తిస్థాయిలో వచ్చారు కానీ వారి గ్రామాలను సమస్యలపై తమరితో అధికారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తారు. కానీ ఈ సమావేశానికి పూర్తిస్థాయిలో అన్ని శాఖల అధికారులు కొన్ని శాఖల వారు రాకపోవడంతో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను చర్చించే వీలు లేనందుకు ఎంపీటీసీలు అందరూ కలిసి అధికారులు పూర్తిస్థాయి లేరు కావున ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరగా, వెంటనే ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు వాయిదా ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జల వెంకటేష్ ఎంపీటీసీలు బత్తిని అనిల్ గౌడ్, వేన్నాకుల వాణి, కదిర జగన్, దూడే ,అమ్మాని, ఆ దూరి సుభాషిని, నల్లాని శోభ, మండల కోఆప్షన్ సభ్యుడు రహిమాన్, వైద్యాధికారి వంశీకృష్ణ ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి విద్యుత్ అధికారి భార్గవి మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.