అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీలొ 10 లక్షల వరకు ఉచిత వైద్యం

-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్.
నవతెలంగాణ-భీంగల్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. శనివారం  మండలం  లోని కుప్కల్, జాగీర్యాల్  గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలను నిలువు దోపిడీ చేశారని ఒకే కాంటాక్టర్ ను పెట్టుకోని దోపిడి చేసారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఒక అవకాశం ఇవ్వాలని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.
ఆడబిడ్డలకు 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు.రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 సాయం అందిస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో ప్రతినెల 2500 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. ఆర్టీసి
బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని తెలిపారు. చేయూత పథకం ద్వారా పింఛను 4000 రూపాయాలు అందిస్తామని తెలిపారు. ఆరోగ్య పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయని అహంకారం పెరిగి పోయిందని అన్నారు.
ఒక్కసారి అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  స్వామి, గోపాల్ నాయక్, రమేష్ జె జె నరసయ్య, అనంతరావు ,రాజు  కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love