మల్లోసారి బీఆర్ఎస్  మాటలు నమ్మి మోసపోవద్దు 

– దుబ్బాక లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి
– కార్యకర్తలకు ఏ ఆపదోచ్చినా నేను అండగా ఉంటా 
– రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచన 
– టీపీసీసీ  ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ- దుబ్బాక రూరల్: రానున్న ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్  పార్టీల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీపీసీసీ  ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు బాలవెంకట్, యువజన నాయకులు గన్నాల సాయి, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి టీపీసీసీ  ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక గడ్డ పై తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురవేసి సమయం ఆసన్నమైంది. అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మల్లోసారి ఆ రెండూ పార్టీల మోసపూరిత హామీల నమ్మి దుబ్బాక ప్రజలు మోసపోయే స్థితిలో లేరన్నారు. పదవుల కోసమో, డబ్బుల కోసమో తాను రాజకీయల్లోకి రాలేదని , పుట్టిన పెరిగిన దుబ్బాక గడ్డ ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని స్పష్టం చేశారు. గ్రూప్ రాజకీయాలు వదిలి దుబ్బాక లో పార్టీ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని  ఆయన తెలిపారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Spread the love