నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. శనివారం వ్యవసాయం అధికారి అజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి ధాన్యాన్ని పరిశీలించి రైతులకు తగిన సూచనలు ఇచ్చారు. తడిసిపోయిన ధాన్యాన్ని మరో పట్టాలోకి మార్చి ఎండ పట్టాలని ఆయన రైతులకు సూచించారు.