ఎయిర్‌టెల్‌ 5జీ వైర్‌లెస్‌ వైఫై వచ్చేసింది..

న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ పేరుతో వైర్‌లెస్‌ 5జీ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. తొలుత ఈ 5జి టెక్నాలజీ ఆధారిత ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ సేవలను ఢిల్లీ, ముంబయి నగరాల్లో ప్రారంభించింది. దీని ద్వారా ఏకకాలంలో 64 ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లకు హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ను పొందడానికి వీలుందని ఆ సంస్థ తెలిపింది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ నెలకు రూ.799 ఛార్జ్‌ను నిర్ణయించింది. పరికరం కోసం రూ.2500 అడ్వాన్స్‌ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

Spread the love