ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ దురాక్రమణ పై న్యాయ విచారణ జరిపించాలి: ఏఐఎస్ఎఫ్

నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ దురాక్రమణ పై న్యాయ విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బాష బోయిన సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మండల సమితి సమావేశం జిల్లా నాయకులు సీపతి వినయ్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషాబోయిన సంతోష్ హాజరయ్యారు. మాట్లాడారు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఉన్న గ్రౌండ్ భూమిని కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం కబ్జా చేశారని,దీనివల్ల కళాశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆటంకంగా మారిందని మండిపడ్డారు. దీనిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని,దీనిపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి,తగు న్యాయ విచారణ చేసి జూనియర్ కళాశాల భూమిని రికవరీ అయ్యే విధంగా చర్యలు తీసుకోని ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని అన్నారు.భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన రవితేజ,మండల నాయకులు వంశీ,చందు,రాజు,శేఖర్ అనిల్,సునీల్,మహేష్,అర్జున్ శ్రీను,చందు, సన్నీ, అంజిలతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love