నెలలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు

– తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్నేహ కాలనీ వాసులు,
నవతెలంగాణ – ధర్మసాగర్
మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నుండి ఉనికి చర్ల గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను ప్రారంభించి ఆరు,ఏడు నెలలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు. మట్టి కంకర వేసి వదిలేసిన కాంట్రాక్టర్, దీంతో రోడ్డుపై వస్తున్న వాహనాలతో దుమ్ము దూళి లేసి తీవ్ర ఇబ్బందులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న  స్నేహ కాలనీ వాసులు జడ పత్తలేని కాంట్రాక్టర్. పట్టించుకోని అధికారులు.ఈ ప్రాంతం గుండా వెళ్లే పశువులకు,గొర్లకు, మేకలకు రోడ్డుపై ఉన్న కంకర రాళ్లుతో వాటి గేట్టలు ఊడి నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వేకువ జామున పనులకు వెళ్ళే ప్రజలకు ఈ రోడ్డు అలసత్వ పనుల విషయంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి బలవుతున్న ప్రజలు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పనులను ప్రారంభించి పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలివేయడం సరికాదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే ఈ పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో రోడ్డుపై వాహనాలను నిర్బంధించి నిరసన తెలుపుతామని డిమాండ్ చేస్తున్నారు.
1.కొంకటి అమరేందర్. రోడ్డుపై నడవాలంటే భయమేస్తుంది. రోడ్డుపై పరిచిన కంకర రాళ్లు తేలి మొలలు సూదుల వల్లే గుచ్చుకొని తీవ్ర గాయాలు ఆయన సందర్భాలు ఉన్నాయి. లేదా ద్విచక్ర  వాహనం, సైకిల్ పై వెళ్తుండగా స్కిడ్ అయి పడ్డ రోజులు ఉన్నాయి. ఇన్ని రోజులైనా ఈ పనులు పూర్తి కాకపోవడం చాలా బాధాకరం.
2. గొర్రె అనిత. షాప్ లో ఉండి అమ్మాలంటే ముక్కుకు మూతికి గుడ్డ కట్టుకొని పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సమీపంలో క్రషర్లు ఉండడం వల్ల ఎడతెరిపి లేకుండా ఈ రోడ్డుపై లారీలు ట్రాక్టర్లు రావడంతో వాటి వెనుక లేస్తున్న మట్టికి దుమ్ము ధూళికి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. ఈ దుమ్ము ధూళితో సర్ది జరాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో మా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
3. కొట్టే లక్ష్మి. ఉదయం,సాయంత్రం పూట పశువులు గోర్లు మేకల మందలతో వచ్చే దుమ్ము మామూలుగా ఉండదు. వాటి రాకపోకులతో  దుమ్ముదులికి ముసమరాక హస్తమా పేషంట్ లాగా తయారవుతున్నాము. ఈ రోడ్డు పనులేమో గాని మా ప్రాణాల మీదికేవచ్చింది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ పనులను వెంటనే  పూర్తి చేసి మమ్ము ఈ దుమ్ము ధూళి  నుండి ఆదుకోవాలి.
4. బండ మాధవరెడ్డి. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఈ ప్రాంత వ్యవసాయదారులమైన మేము బర్రెలను ఆవులను దూడలను పొలంలో దున్నిన తర్వాత వాటి కాళ్లు మెత్తబడి ఈ ప్రాంతం గుండా తీసుకెళుతుండగా రోడ్డుపై లేచిన కంకర రాళ్ళకు పశువుల గిట్టలు తెగి అవి విలవిలలాడి తల్లడుగుతున్నాయి. ప్రభుత్వానికి ఏమాత్రం మాపై చిత్తశుద్ధి ఉన్న ఈ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలి.
Spread the love