విద్యార్థిని ఐశ్వర్య చదువుల బాధ్యత మాదే..

– మంద స్నేహ-భాస్కర్ రెడ్డి దంపతులు 
నవతెలంగాణ-చేర్యాల : విద్యార్థిని ఐశ్వర్య చదువులు పూర్తి అయ్యేవరకు బాధ్యత తమదేనని హైదరాబాద్ కు చెందిన మంద స్నేహ-భాస్కర్ రెడ్డి దంపతులు తెలిపారు.సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రానికి చెందిన సంఘ సేవకులు అందె విజయ్ కుమార్ మాట్లాడుతూ చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం నిరుపేద కుటుంబం స్వామి-లక్ష్మీ ల కుమార్తె ఐశ్వర్య జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుకుంటుందని, ఐశ్వర్య తండ్రి రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయాన్ని పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రచ్చ కిష్టయ్య గమనించి తమకు తెలపడంతో ఈ విషయాన్ని  హైదరాబాద్ కు చెందిన మంద స్నేహ-భాస్కర్ రెడ్డి దంపతులకు చేరవేయగా అమ్మాయి చదువులు పూర్తి అయ్యేవరకు చదివిస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు.  ఈ విద్యా సంవత్సరం మొదటి విడత  ఫీజు రూ.35 వేలను చెల్లించేందుకు తమకు అందజేయగా ఆ డబ్బులను విద్యార్థిని కి అప్పగించి  కళాశాలకు పంపించి నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో  తమతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన స్నేహ-భాస్కర్ రెడ్డి దంపతులను విజయ్ కుమార్ ఈ సందర్భంగా అభినందించారు.
Spread the love