ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్..?

నవతెలంగాణ – హైదరాబాద్: ఈనెల 4న ఎన్నికల కౌంటింగ్ కు వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ హాల్ లోకి వెళ్లే ముందుగా వారికి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.  ఆ టెస్ట్ లో మద్యం తాగినట్టు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా వెనక్కి తిరిగి పంపుతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారాయి.

Spread the love