– కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ శాసన సభకు జరుగనున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అర్‌వి.కర్ణన్ సూచించారు.మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. నవంబర్ 3 నుండి నామినేషన్ ల స్వీకరణకు సంబందించి రిటర్నింగ్ అధికారికి సూచనలు చేశారు. అకౌంటింగ్ టీమ్,వివిటి, సివిజిల్,హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, నామినేషన్ సమయం రికార్డ్ చేయాలని అన్నారు. నామినేషన్ సందర్భంగా 100 మీల పరిధి మార్కింగ్ చేసి నామినేషన్ వేసేందుకు వాహనాలను ఎన్నికల నిబంధనల మేరకు అనుమతించాలన్నారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి రవి,తహశీల్దార్ రవి, టూ టౌన్‌సబ్ ఇన్‌స్పెక్టర్ నాగ రాజు ఉన్నారు.