నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేయాలి

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ – భువనగిరి
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్లకు  సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.  బుధవారం  ఆయన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సమీక్షిస్తూ…  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. బూతు లెవల్ స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగే విధంగా అవగాహన కల్పించాలన్నారు.  సెక్టార్ ఆఫీసర్లతో  ఓటు శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ ఏరియాలో ఓటింగ్ శాతం పెరిగే విధంగా చూడాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎన్నికల నిర్వహణపై హెల్ప్ డెస్క్ ల ద్వారా వివరించాలని తెలిపారు. ఈవీఎం రెండవ ర్యాండోమైజేషన్  ప్రక్రియను నిర్వహించాలన్నారు. సువిధ ద్వారా అనుమతులివ్వలని, సి -విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని, హోమ్ ఓటింగ్ ద్వారా 85 సంవత్సరాలు నిండిన వారికి ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యం కల్పించాలని, ఎన్నికలు  ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా  జరిగేందుకు అని చర్యలు తీసుకోవాలని తెలిపారు. జరగాలని వారు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జండగే, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ పి. బెన్ షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు గంగాధర్, జనగాం జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్,  ఆర్డీవో అమరేందర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వర చారి పాల్గొన్నారు.
Spread the love