గూగుల్‌ మరోసారి ఉద్యోగులపై వేటు ..

నవతెలంగాణ – వాషింగ్టన్‌ : టెక్‌ సంస్థల్లో ఉద్యోగులపై వేటు కొనసాగుతోంది. తాజాగా గూగుల్‌ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే ఎంతమందిని తొలగించారనే సమాచారం లేదని స్థానిక మీడియా తెలిపింది. మరికొందరిని బెంగళూరుతో పాటు అట్లాంటా, చికాగో, డబ్లిన్‌, మెక్సికో సిటీ హబ్‌లలోకి మార్చనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్‌ వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. మరిన్ని తొలగింపులు వుండవచ్చని గూగుల్‌ సిఇఒ సుందర్‌ పిచారు హెచ్చరించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని గూగుల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రుత్‌ పోరాట్‌ మెమోలో పేర్కొన్నారు. టెక్‌ రంగంపై ఎఐ (కృత్రిమ మేథస్సు) ప్రభావంతో ఈ మార్పులు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే ఎంతమందిని తొలగించారు, ఏ బృందం తొలగింపులను ఎదుర్కొందన్న అంశాన్ని ఆయన పేర్కొనలేదు.

Spread the love