బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత క్యాంపెయిన్ 

– సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జనవరి 20న జిల్లా సదస్సును జయప్రదం చేయండి
నవతెలంగాణ – కంటేశ్వర్
బీజెపి విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత క్యాంపెయిన్ సీఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జనవరి 20న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటియు కార్యాలయం వద్ద సీఐటియు,  రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, వ్యవసాయ  కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్ లు మాట్లాడుతూ..జనవరి 20 న జిల్లా సదస్సు, 26న ట్రాక్టర్ ర్యాలీ జనవరి 27 నుండి ఫిబ్రవరి 15 వరకు ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 16న సమ్మె ఉంటుంది. కేంద్రంలోని బీజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆల్ ఇండియా కమిటీలు పిలుపునిచ్చాయి. అఖిల భారత క్యాంపెయిన్ ను జయప్రదం చేయడం కోసం బుధవారం సీఐటియు కార్యాలయంలో  రైతు, వ్యవసాయ, సీఐటీయూ సంఘాల సంయుక్త సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  గడిచిన 10 ఏళ్లలో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేరే విధంగా  మోడీ పరిపాలన ఉందని సమావేశంలో అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించి రోజుకు రూ.600లు చొప్పున 200 వందల రోజులు పనిదినాలు కల్పించాలన్నారు. రైతు ఉద్యమం జరిగిన సందర్భంలో చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మోడీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వరంగ సంస్థల ప్రైయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. బీజెపి ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రజల హక్కులను కాలరాసిందని, మోడీ దుర్మార్గపు పాలన ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సీఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సంఘాలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్, సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు విజయ, నన్నేసాబ్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ ,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love