కల్లుగీత కార్మికుల సమస్యలను అన్ని పార్టీలు మేనిపెస్టోలో చేర్చాలి

– సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటాలు 
– 66వ ఆవిర్భావ దినోత్సవంలో కేజీకేస్ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ -తాడ్వాయి
కల్లుగీత కార్మికుల సమస్యలు అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో పెట్టాలని తెలంగాణ కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పులి చిన్న నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాటాపూర్ తాటి వనంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద తెలంగాణ కల్లగీత కార్మిక సంఘం 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడ్డం శ్రీధర్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించేది ఒక కల్లు గీత కార్మిక సంగమేనని కల్లు గీత కార్మిక సంగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు పులి చిన్న నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. అప్పటి ఉమ్మడి రాష్టం, ఇప్పుడు తెలంగాణ రాష్టం మహబూబాబాద్ జిల్లాలోని దాట్ల గ్రామంలో 1957అక్టోబర్ 20 న కల్లు గీత కార్మిక సంగం ఆవిర్బవించిందని, అప్పటి నుండి నేటి వరకు ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా కల్లు గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని, పోరాటాలతోనే అనేక సమస్య లు సాధించు కోవడం జరిగిందని అన్నారు.
ఇప్పుడు అన్ని పార్టీలు గీత కార్మికుల సమస్యలపై మేని పేస్టో విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గీత కార్మికుల కు ఒరగబెట్టింది ఏమి లేదని అన్నారు.. మునుగోడు ఎన్నికలముందు అనేక హామీలు ఇచ్చిన ఒక్కటీ కూడ అమలు చేయలేదని అన్నారు.. సమస్య ల పరిష్కారం కొరకు సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాలకుర్తి రవీందర్ గౌడ్, తాడ్వాయి మండల అధ్యక్షులు బెల్లంకొండ రాజు గౌడ్, గండు సదయ్య గౌడ్, బెల్లంకొండ నరేష్ గడ్డం రాములు పులి రవి, ముద్దసాని రాజేందర్, పాలకుర్తి వెంకట్రాం నర్సయ్య, సత్యనారాయణ, లాలయ్య గౌడ్, ఊరుకొండ స్వామి,
గడ్డం మొగిలి, ముంజ ప్రదీప్ గౌడ్, బెల్లంకొండ నగేష్ గౌడ్, పులి రాజు గట్టు మల్లయ్య తో పాటు 50 మంది కల్లు గీత కార్మికులు పాల్గొన్నారు.
Spread the love