బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలో చేరాలి

– గొంది దివాకర్ మండల విద్యాధికారి
నవతెలంగాణ – గోవిందరావుపేట
బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని మండల విద్యాధికారి గొంది దివాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు కే రఘురాం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ గొంది దివాకర్ హాజరై మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ గ్రామంలోని బడి ఈడు పిల్లలందరూ ఈ పాఠశాలలో ప్రవేశం పొంది తమ భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవాలని కోరినారు మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ శ్రీ సోమా రెడ్డి  మాట్లాడుతూ  ప్రభుత్వం వారు మన ఊరు మనబడి అనే కార్యక్రమం కిందపాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించారని సీఎం బ్రేక్ ఫాస్ట్ రాగిజావ, మధ్యాహ్న భోజనం పథకం  పాఠ్యపుస్తకాలు రెండు జతల     యూనిఫాం లు మొదలగు సౌకర్యాలు కల్పించాలని వాటిని  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు పిల్లల తల్లిదండ్రులు  సంరక్షకులు విచ్చేసి తమ పిల్లల చదువు గురించి తెలుసుకొని తరగతి వారీగా పిల్లల ప్రదర్శనలను చూసినారు. ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటివరకు పాఠశాలలో జరిగిన విద్య  బోధన గురించి ప్రధానోపాధ్యాయులు రఘురాం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పేరెంట్స్ తో పాటు ఉపాధ్యాయులు వై కన్నయ్య కె రమేష్ బి సూర్య ఎస్ రాజు   ఐ  ఈ ఆర్ పి రమేష్ ఎం ఆర్ సి నుంచి విష్ణు రజిత బిక్షపతి  మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు పాల్గొన్నారు.
Spread the love