Saturday, May 9, 2026
E-PAPER
Homeఆటలుఅలెన్‌ అదరహో

అలెన్‌ అదరహో

- Advertisement -

ఢిల్లీ 142/8, కోల్‌‌కతా 147/2కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ ఆఖర్లో
47 బంతుల్లోనే శతక షో
ఢిల్లీపై కోల్‌‌కతా ఘన విజయం


అదరగొడుతోంది. ఆరంభంలో ఆరు మ్యాచ్‌‌ల్లో ఒక్క విజయం సాధించని నైట్‌‌రైడర్స్‌.. తర్వాతి నాలుగు మ్యాచ్‌‌ల్లో వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. బౌలర్లు రాణించటంతో ఢిల్లినీ 142 పరుగులకు కట్టడి చేసిన నైట్‌‌రైడర్స్‌.. అలెన్‌ (100 ‌నాటౌట్‌) అజేయ సెంచరీతో అలవోక విజయం సాధించింది.

న్యూఢిల్లీ : ఫిన్‌ అలెన్‌ (100 ‌నాటౌట్‌, 47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌‌తో కదం తొక్కాడు. పది సిక్స్‌‌లు, ఐదు ఫోర్లతో బౌండరీల రూపంలోనే 80 పరుగులు పిండుకున్న అలెన్‌.. ఫిరోజ్‌ ‌షా కోట్ల గ్రౌండ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫిన్‌ అలెన్‌ అజేయ సెంచరీకి తోడు కామెరూన్‌ ‌గ్రీన్‌ (33 నాటౌట్‌, 27 బంతుల్లో 2 సిక్స్‌‌లు) రాణించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై 8 వికెట్ల తేడాతో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ ‌ఘన విజయం సాధించింది. 143 పరుగుల స్వల్ప ఛేదనలో ఓపెనర్‌ అజింక్య రహానె (13, 9 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), రఘువంశీ (1) ‌పవర్‌‌ప్లేలోనే నిష్క్రమించారు. స్పిన్‌‌కు అనుకూలించిన పిచ్‌‌పై మిడిల్‌ ఓవర్లలో మాయ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌సిద్ధమవగా… ఫిన్‌ అలెన్‌ ఊచకోత ఇన్నింగ్స్‌‌తో చెలరేగాడు. 14.2 ఓవర్లలో 2 వికెట్లకు కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ 147 ‌పరుగులు చేసింది. మరో 34 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. పవర్‌‌ప్లేలో 43/2తో నిలిచిన కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ను అలెన్‌ ఒంటిచేత్తో గెలిపించాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌‌లతో 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన అలెన్‌.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఏడు సిక్సర్లతో 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అలెన్‌ ‌సునామీ ఇన్నింగ్స్‌‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌సీజన్లో ఏడో పరాజయం మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్‌ ‌రేసు నుంచి దాదాపుగా నిష్ర్కమించింది. పది మ్యాచ్‌‌ల్లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌కు ఇది నాల్గో విజయం కాగా 11 మ్యాచ్‌‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ఇది ఏడో ఓటమి. ఛేదనలో అజేయ సెంచరీ బాదిన ఫిన్‌ అలెన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌’గా నిలిచాడు.

​నిశాంక రాణించినా..
సొంతగడ్డపై తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌స్వల్ప స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్‌ ‌పతుమ్‌ ‌నిశాంక (50, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) అర్థ సెంచరీతో మెరిసినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. కెఎల్‌ ‌రాహుల్‌ (23, 14 బంతుల్లో 4 ఫోర్లు), నిశాంక తొలి వికెట్‌‌కు ఐదు ఓవర్లలో 49 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కానీ, బౌలింగ్‌‌కు అనుకూలించిన పిచ్‌‌పై కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ ‌గొప్పగా సద్వినియోగం చేసుకుంది. అనుకూల్‌ ‌రాయ్‌ (2/31), కార్తీక్‌ ‌త్యాగి (2/25) సహా సునీల్‌ ‌నరైన్‌, వైభవ్‌ అరోరా, కామెరూన్‌ ‌గ్రీన్‌‌లు వికెట్ల వేటలో రాణించారు. నితీశ్‌ ‌రానా (8), సమీర్‌ ‌రిజ్వీ (3), ట్రిస్టన్‌ ‌స్టబ్స్‌ (2), అక్ష‍ర్‌ ‌పటేల్‌ (11) దారుణంగా విఫలమయ్యారు. ఆషుతోశ్‌ ‌శర్మ (39, 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) ఆఖర్లో విలువైన పరుగులు జోడించాడు. దీంతో డిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది.

కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ ‌స్పిన్నర్లు మ్యాచ్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌నుంచి లాగేసుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌స్పిన్నర్లపై ఫిన్‌ అలెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ ‌స్పిన్నర్లు సంయుక్తంగా 12 ఓవర్లలో 76 పరుగులకు 3 వికెట్లు పడగొట్టారు. ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌స్పిన్నర్లు సంయుక్తంగా 9 ఓవర్లలో 102 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ ‌పడగొట్టారు. ఇక్కడే మ్యాచ్‌‌పై కోల్‌‌కతా నైట్‌రైడర్స్‌ ‌పట్టు బిగించింది. అక్ష‍ర్‌ ‌పటేల్‌, కుల్‌‌దీప్‌ ‌యాదవ్ వంటి ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు క్యాపిటల్స్‌ అమ్ములపొదిలో ఉన్నప్పటికీ ఆశించిన ప్రభావం చూపించటంలో విఫలం అయ్యారు.

సంక్ష‍ిప్త స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ : 142/8 (పతుమ్‌ ‌నిశాంక 50, ఆషుతోశ్‌ ‌శర్మ 39, కార్తీక్‌ ‌త్యాగి 2/25, అనుకూల్‌ ‌రాయ్‌ 2/31)
కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ : 147/2 (ఫిన్‌ అలెన్‌ 100 ‌నాటౌట్‌, కామెరూన్‌ ‌గ్రీన్‌ 33 నాటౌట్, అజింక్య రహానె 13, అక్ష‍ర్‌ ‌పటేల్‌ 1/27)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -