కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు
మంత్రి పొంగులేటి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై-జి 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి ఒకేసారి 11,56,915 ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ‘ఆవాస్ ప్లస్–2024’ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇండ్లకు అర్హులుగా తేలాయని తెలిపారు. వీటికి సంబంధించి సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలన్నీ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ, కేంద్రం నుంచి లక్ష్యాల ప్రకటనలో జాప్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో గత 12 ఏండ్లుగా పేదలకు ఇండ్ల నిర్మాణం నిలిచిపోయి తీవ్రమైన డిమాండ్ పేరుకుపోయిందని వివరించారు. కేంద్రం వాటా, రాష్ట్రం వాటాతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టు పొంగులేటి తెలిపారు. స్వయంగా రాష్ట్రానికి వచ్చి ఇండ్ల కేటాయింపును ప్రకటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానాన్ని కేంద్ర మంత్రి మన్నించారు. తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, రామసహాయం రఘురాం రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ. గౌతమ్ తదితరులు ఉన్నారు.
రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



