Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజిక ఉద్యమాలకు పూలే దంపతులే స్ఫూర్తి

సామాజిక ఉద్యమాలకు పూలే దంపతులే స్ఫూర్తి

- Advertisement -

14న విగ్రహాల ఆవిష్కరణను ఘనంగా నిర్వహిద్దాం : మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

 సామాజిక ఉద్యమాలకు జ్యోతిరావు పూలే, సావిత్రిభాయి పూలే దంపతులే స్ఫూర్తి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఫూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించనున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలోని ప్రాంతాన్ని మంత్రి బుధవారం పరిశీలించారు. అనంతరం డీఎస్ఎస్ భవన్ లో ఆయన బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు ,కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరి కార్యక్రమని ఆయన తెలిపారు. ఏర్పాట్లను సంబంధిత విభాగాల సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని ఆగస్టు 18న సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు, ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహిం చేందుకు నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరు రెండు కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి.హను మంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, ఈర్లపల్లి శంకరయ్య, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాలమయాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -