జ‌మ్మూ బేస్ క్యాంపు నుంచి బ‌య‌లుదేరిన అమ‌ర్‌నాథ్ యాత్రికులు

నవతెలంగాణ – జ‌మ్మూక‌శ్మీర్: అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు తొలి బ్యాచ్ భ‌క్తులు ఇవాళ తెల్ల‌వారుజామున బ‌య‌లుదేరి వెళ్లారు. జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా .. భ‌గ‌వ‌తి న‌గ‌ర్ బేస్ క్యాంపు వ‌ద్ద జెండా ఊపి యాత్ర‌కుల బ‌స్సును ప్రారంభించారు. తొలి మ్యాచ్ మొద‌ట‌గా ప‌హ‌ల్గామ్‌, బ‌ల్తాల్ బేస్ క్యాంపు వ‌ద్ద‌కు వెళ్తారు. అక్క‌డ నుంచి హిమాల‌యాల్లో ఉన్న అమ‌ర్‌నాథ్ క్షేత్రానికి వెళ్తారు. రెండు ట్రాక్ల ద్వారా జూలై ఒక‌టో తేదీ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. సుమారు 62 రోజుల పాటు ఈ యాత్ర కొన‌సాగుతుంది. నున్‌వాన్‌-ప‌హ‌ల్గామ్ రూటు అనంత‌నాగ్ జిల్లాలో ఉంటుంది. ఇది సుమారు 48 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇక బ‌ల్తాల్ రూటు చాలా పొట్టింది. ఇది 14 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇవాళ ఉద‌యం సుమారు 3500 మంది భ‌క్తులు యాత్ర ప్రారంభించారు.

Spread the love