నేడు అవినాష్​రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​ తీర్పు…

నవతెలంగాణ – హైదరాబాద్
కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికి కన్నా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని.. అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఏప్రిల్‌ 17 నుంచి అనేక మలుపులు తిరిగిన ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తేలిపోనుంది.

Spread the love