Tuesday, May 5, 2026
E-PAPER
Homeజిల్లాలుసింగారంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

సింగారంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

- Advertisement -

– భారీగా మోహరించిన పోలీసులు
– దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి – కుల సంఘాల నాయకులు
– సాయంత్రం వరకు పునఃప్రతిష్టకు పోలీసుల సన్నాహాలు
నవతెలంగాణ – బయ్యారం
మండలంలోని సింగారం గ్రామ పంచాయతీలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తుల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షంచాలని అంబేద్కర్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సింగారం గ్రామంలో గార్ల, బయ్యారం సిఐ రవీందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధ్వంసం చేసిన వ్యక్తుల పై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్రామంలో అనుమానం వ్యక్తుల ఇండ్లను పోలీసులు సోదా చేశారు.

అంబేద్కర్ సంఘం నాయకులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దార్యప్తు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట అంబేద్కర్ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టకు పోలీసులు  సన్నాహాలు చేస్తున్నారు. 2023 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు పక్కపక్కనే నెలకొల్పారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాత గణేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, బాణోతు హరిప్రియ నాయక్, మాజీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్ బాబు గ్రామానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -