Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆడబిడ్డ వివాహానికి ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

ఆడబిడ్డ వివాహానికి ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి  మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట మెహన్ రెడ్డి  కూమార్తె వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. తన కూతురి వివాహం ఈ నెల 8న జరగనుండగా, ఎస్.ఆర్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ పరిస్థితిని సుభాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శారీరక వికలాంగుడుగా ఉన్న మోహన్ రెడ్డి కి ఆర్థిక సహాయం అందించాలని, మానవతా దృక్పథంతో స్పందించిన సుభాష్ రెడ్డి తన కూతురు వివాహానికి ఫౌండేషన్ ద్వారా రూ.25 వేల నగదును పంపించారు. గతంలో సుభాష్ రెడ్డి మోహన్ కు త్రీ వీలర్ బైక్‌  ఉపాధి, రవాణా కోసం ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు సుభాష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు మట్ట శ్రీనివాస్, కప్పేరా రవీందర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సైదుగారి అశోక్ గౌడ్, చాట్ల బాబు, పిప్పిరిశెట్టి శేఖర్ , వడ్ల నర్సింహా చారి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -