నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ వర్కర్లతో రివ్వు సమావేశం నిర్వహించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శ్రీలేఖ తెలిపారు. ఇందులో భాగంగా ఆశ వర్కర్లు చేపట్టవలసిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమానికి తహశీల్దార్ రంజిత్ కుమార్, మండల ఎంపీడీవో జగదీష్ కుమార్, ఆర్ఐ సాయిబాబా లను ప్రత్యేకంగా ఆహ్వానిచ్చినట్లు ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు గర్భిణీల నమోదు, వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆశా వర్కర్లు చేపట్టవలసిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించినట్లు చెప్పారు. అనంతర తహశీల్దార్, ఎంపీడీవో మాట్లాడుతూ .. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందించవలసిన జాగ్రత్తలను ఆశ వర్కర్లు ప్రత్యేకంగా చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లకు రివ్యూ మీటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



