- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మంగళవారం జెండా ఊపి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాత్రికులు పవిత్రమైన హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ యాత్ర వారి జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆమె ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్వర్, వాజీద్, జావీద్, యునుస్, మన్సూర్, హేజాజ్, సీనియర్ నాయకులు అమీర్, దాసు, పర్వేజ్, జాకీర్, స్థానిక ప్రజలు, యాత్రికుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



