- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలో ఎవరు కూడా రోడ్డును ఆక్రమించి బోర్డులు పెట్టకూడదని, అలా పెట్టడం వలన వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి అన్నారు. ట్రాఫిక్ కి అంతరాయం కలుగకుండా పట్టణంలో మున్సిపల్ , పోలీస్ శాఖ సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు బోర్డులను తీసేయడం జరిగింది. కావున వ్యాపారులు పోలీస్ శాఖ కి మున్సిపల్ శాఖకి సహకరిస్తూ ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం లేకుండా ఎవరు కూడా బోర్డులను, వ్యాపార వస్తువులను రోడ్డుపై పెట్టకూడదని హెచ్చరించారు.
- Advertisement -



