Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంబేద్కర్‌ పోరాటం ప్రపంచానికి ఆదర్శం

అంబేద్కర్‌ పోరాటం ప్రపంచానికి ఆదర్శం

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన పోరాటం యావత్‌ ప్రపంచానికి ఆదర్శమని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్‌ జయంతి (ఏప్రిల్‌ 14)ని పురస్కరించుకుని సోమవారం ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మహనీయుని ఆశయాల సాకారానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌కు ఘన నివాళులర్పిస్తూ దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు ఆయన నిరంతరాయంగా కషి చేశారని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తును తన ముందుచూపుతో ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్‌ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని స్మరించారు.

బాబాసాహెబ్‌ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయటంతో పాటు రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మెస్‌ ఛార్జీలు, కాస్మొటిక్‌ ఛార్జీలు ప్రజా ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణం చేపడుతుందని అన్నారు. దీంతో అన్ని వర్గాలు, అన్ని మతాల పిల్లలందరూ ఒకే చోట నాణ్యమైన విద్యాబోధనను అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్‌ దార్శనీకత ఉన్న సామాజిక సంస్కర్త అనీ, న్యాయం, సమానత్వం, పీడితుల సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు అతని ఆదర్శాలు మనకు దిశా నిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.
సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను భారత సమాజానికి అందించిన గొప్ప దార్శనికుడిగా అంబేద్కర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ ఆశయాలను అనుసరించి సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, హక్కులు, అవకాశాల్లో సమానత్వం సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -