- Advertisement -
– 23 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్ నాంపల్లి పరిధిలోని రెడ్ హిల్స్ ప్రాంతంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ భవనంలోని మూడో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాద సమయంలో భవనంలో ఉన్న 23 మంది నివాసితులను సురక్షితంగా బయటికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



