పవిత్రమైంది, ఆరోగ్యకరమైనది ఉసిరి

నవతెలంగాణ-గోవిందరావుపేట: కార్తీక మాసంలో మరియు దీపావళి సమయంలో ఎంతో పవిత్రమైంది ఉసిరి. ఉసిరి చెట్టు కింద వనభోజనాల కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ మాసంలో ప్రత్యేకించి మహిళలు ప్రత్యేక పూజలు ఆచరిస్తారు ఉసిరి చెట్టుకు. మండలంలో ప్రస్తుతం ఉసిరికాయలు విస్తృతంగా లభిస్తున్నాయి. జనగలంచ, మొండియాలతోగు, దేవుని గుట్ట, ఇతర తదితర ప్రాంతాలలో నివసిస్తున్న గుత్తి కోయలు 163 వ జాతీయ రహదారి వెంట పలుచోట్ల ఉసిరికాయలను విక్రయిస్తూ జీవనం పొందుతున్నారు. ఈ సీజన్లో ఉసిరికాయ పచ్చడి ఎంతో ఇష్టమైన పచ్చడగా ఈ ప్రాంత ప్రజలు భావిస్తారు. మంచిగా ముదిరిన ఉసిరికాయలను పచ్చడగా వినియోగించుకోవడం వల్ల ఆహారంతో పాటు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అంటున్నారు పెద్దలు.  వరంగల్లు హైదరాబాదు పట్టణాలండి కార్లు తదితర వాహనాలలో వెళ్లే పయాణికులు సైతం ఉసిరికాయలను ఖరీదు చేసుకొని వెళుతున్నారు. కిలో 50 రూపాయలకు విక్రయిస్తూ గుత్తి కోయలు ఆర్థికంగా. ఈ సీజన్లో కొంతమేర లబ్ధి పొందుతున్నారు. ఈ గుత్తి కోయ కుటుంబాలలో మగవారు ఉదయాన్నే ఆడకి వెళ్లి సేకరించిన ఉసిరికాయలను గుత్తి కోయ మహిళలు రహదారి వెంట వారు నివసిస్తున్న ప్రాంతంలో గుంపుగా పెట్టి విక్రయిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురియడంతో ఉసిరికాయలు విస్తారంగా లభిస్తున్నట్లు గుత్తి కోయలు తెలుపుతున్నారు. ఇప్పటినుండి మొదలుకొని మరో నెల రోజుల వరకు కాయలు లభ్యమవుతాయని అంటున్నారు. హోటల్లో వారు కూడా అధిక సంఖ్యలో ఇక్కడి నుండి ఉసిరికాయలను ఖరీదు చేసి తీసుకు వెళుతున్నట్లు గుత్తి కోయలు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా విక్రయించేందుకు పలువురు తమ వద్ద నుంచి కాయలను తీసుకుపోతున్నట్లు తెలుపుతున్నారు. సిటీ మార్కెట్లో ఉసిరి కాయలు తోటల ద్వారా సాగుచేసిన హైబ్రిడ్ కాయలను విక్రయిస్తున్నారని తోటల ద్వారా సాగుచేసిన వాటిపై పురుగుమందుల అవశేషాలు ఉంటాయని ఈ ఉసిరి కాయలు అడవిలో లభించడం వల్ల ఎలాంటి హానికరం ఉండదని అంటున్నారు. గత నెల రోజుల నుండి ఇప్పటికే ఉసిరికాయల పచ్చడితో భోజనం చేస్తున్నట్లు ఈ ప్రాంత స్థానికులు తెలుపుతున్నారు. వగరుగా ఉండే ఉసిరికాయల పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదని గృహిణులు అంటున్నారు.
Spread the love