– నువ్వు కన్న కలల కోసం : రేవంత్‌రెడ్డి ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన దానివి. మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా? నువ్వు కన్న కలల కోసం మరికొన్నాళ్లు వేచి ఉండలేకపోయావా? నిన్ను కన్నవారి కండ్లలో ఆనందం చూడాలన్న సంగతిని మరిచిపోయావా? ఎంతోమందికి దారి చూపాలనుకున్నదానివి. ఇలా అర్ధంతరంగా నీ ప్రయాణం ముగిస్తావా?’ అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘యువతీ, యువకుల్లారా! ఆత్మహత్యలు వద్దు. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. మన భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఈ నక్కలు ఎక్కడ నక్కినా గుంజుకొచ్చి దోషులుగా నిలబెడదాం. వీళ్ళ నక్క జిత్తులను నడి రోడ్డులో నిలబెట్టి తరిమికొడదాం’ అంటూ భరోసాఇచ్చారు.
నిరుద్యోగులారా బతికి సాదిద్దాం ఎంపీ కోమటిరెడ్డి విజ్ఞప్తి
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘అందరికీ ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులారా.. బతికి సాధిద్దాం…ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. తల్లి తండ్రులకు కడుపుశోకం మిగల్చొద్దని ఒక ప్రకటనలో కోరారు. గ్రూప్ 2 వాయిదాతో వరంగల్‌కు చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనేనని ఆయన అభిప్రాయపడ్డారు.
నిస్సహాయతతోనే ప్రవళిక ఆత్మహత్య రేణుక చౌదరి ఆవేదన
ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతోనే ప్రవళిక నిస్సహాయతకు గురై ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఖబర్దార్ కేసీఆర్ జాగ్రత్త అని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీఎస్‌స్సీపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రవళికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య
నిరుద్యోగ యువతి ప్రవళికది ఆత్మహత్య కాదు…ప్రభుత్వ హత్యేనని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. పరీక్షల తేదీలను నిర్ణయిస్తూ పదేపదే వాయిదాలు వేస్తూ పెట్టిన పరీక్షలకు పేపర్ లీకులు చేస్తూ రద్దు చేస్తూ…ఇలాగా అన్ని విషయాల్లో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
– టీపీసీసీ ఉపాధ్యక్షులు, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి