వ్యాన్ ను వెనకనుండి ఢీ కొట్టిన ఆటో…

– ఇరువురికి తీవ్ర గాయాలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆగి ఉన్న వ్యాను వెనుక నుండి ఆటో ఢీ కొట్టడంతో ఇరువురికి తీవ్రగాయాలు అయిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. క్షతగాత్రుల లో ఒకరైన బరసా మణి కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తిరువూరు సమీపంలోని గంపలగూడెం కు చెందిన 8 మంది యువకులు తిరుపతి రావు కు చెందిన ఆటోలో సోమవారం అశ్వారావుపేట మండలం లో గల గుబ్బల మంగమ్మ ఆలయానికి దైవ దర్శనం నిమిత్తం వచ్చారు.రాత్రి అక్కడే గడిపి మంగళవారం తిరుగు ప్రయాణంలో అశ్వారావుపేట సత్తుపల్లి రహదారి పై స్థానిక పట్టు పరిశ్రమ విత్తన కేంద్రం సమీపంలో ఆగి ఉన్న వ్యాన్ ను వెనకనుండి వీరు ప్రయాణిస్తున్న ఆటో ఇటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న తిరుపతి రావుకు,విజయ కుమార్ లు తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్.ఐ రాజేష్ కుమార్ క్షతగాత్రులను చిట్టితల్లి అంబులెన్స్ లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Spread the love