ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూల్ మండలంలో నిర్మించాలి 

– ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాసూరి వినతిపత్రమందజేత 
– 962లో 25 ఏకరాల ప్రభుత్వ భూమి ఉందంటూ విజ్ఞప్తి 
నవతెలంగాణ – బెజ్జంకి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యనందించడానికి నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూల్ నిర్మాణం బెజ్జంకి మండల కేంద్రంలో చేపట్టాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రమందజేసినట్టు గురువారం మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆర్టీఐ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ తెలిపారు. బెజ్జంకి శివారులోని సర్వే నంబర్ 962 యందు ఇటీవల ప్రభుత్వం స్వాదీనం చేసుకున్న సుమారు 25 ఏకరాల భూమి అందుబాటులో ఉందని.. ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి వినియోగించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేసినట్టు రాసూరి మల్లికార్జున్ తెలిపారు.
Spread the love