డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈనెల 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాను నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సింగీ తంకి ఒక ట్రిబ్యూట్‌లా, ఆయనతో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్‌లా అనిపించింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలోనే సంభా షించే కథ ఇప్పటివరకు రాలేదు. నిజంగా ఇది నా కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ సినిమా. సహజంగా సినిమాలో డైలాగ్ మారినా ఎడిటిం గ్‌లో సర్దుకోవచ్చు. కానీ ఇది మ్యూజికల్ సినిమా. డైలాగ్ మారితే స్కేల్ మారిపోతుంది. మొత్తం మళ్లీ చేయాల్సి వస్తుంది. అందుకే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ సినిమాలో అద్భుతమైన భావో ద్వేగాలు, గూస్‌బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. స్క్రిప్ట్ స్థాయిలోనే అవి కుదిరాయి. ఈ విషయంలో సింగీతంకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఒక విభిన్నమైన సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు ఖచ్చితంగా కలుగుతుంది. సినిమా చూసి ఇంటికి వెళ్తూ మాటల్ని కూడా పాటల్లా పాడుకుంటూ వెళ్తారు. కమల్ హాసన్ స్టూడియోకు వచ్చి సినిమా చూశారు. ‘ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది` అని అన్నారు. అది మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది.
ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది
- Advertisement -
- Advertisement -



