ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌రెడ్డి

నవతెలంగాణ-భువనగిరి రూరల్‌
వలిగొండ మండలం లోని కేర్చిపల్లి, మొగిలిపాక,వెల్వర్తి గ్రామాల్లో జరిగిన ఇంటింటికి కాంగ్రెస్‌ ప్రచారంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలపై ప్రజలకు వివరించారు. గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించినప్పుడు ప్రజల నుంచి అనుహ్యా స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ లను అందరికి వివరించారు. మూడు గ్రామాల నుండి సుమారుగా 200 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ లోకి భారీగా చేరికలు
పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ గ్రామంలో ఈరోజు భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి ఇంటింటికి కాంగ్రెస్‌ ప్రచారంలో పాల్గొన్నారు. వారికి గ్రామ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు కుంభం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గోదాసు బాల్‌ రాజ్‌, గొదాసు లక్ష్మణ్‌, సందీప్‌, బాలకష్ణ, భాస్కర్‌, సుధాకర్‌,శ్రీశైలం, వెంకటేష్‌ లతో పాటు సుమారు 60మంది పార్టిలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love