ఏపీలో మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభం..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో మళ్ళీ అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంత్రి నారాయణ వీటి ఏర్పాట్లపై సమీక్షించారు. ‘3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వీటి నిర్వహణ మళ్లీ ఇస్కాన్‌కు ఇవ్వాలా? టెండర్లు పిలవాలా? అనే దానిపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు. పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీరుస్తామని తెలిపారు. గతంలో 4 కోట్ల 60 లక్షల ప్లేట్ల ఆహారం అందించామని వివరించారు.

Spread the love