తెలంగాణకు మళ్లీ నిరాశే?

Disappointment for Telangana again?సామాజిక న్యాయం, సమానత్వాన్ని ప్రోత్సహిస్తూనే మన దేశం శీఘ్ర, సమతుల్య ఆర్థిక వృద్ధిని సాధించడం కేంద్ర బడ్జెట్‌ లక్ష్యం. రెండు నెలల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కా లిక బడ్జెట్‌ అందరికీ ఆనందాన్ని పంచలేకపోయింది. కొన్ని వర్గాలకు కాస్త ఊరట లభించగా, ఎక్కవ వర్గాలను నిరు త్సాహానికి గురిచేసింది. సమర్థవంతమైన వనరుల కేటా యింపును నిర్ధారించడం, నిరుద్యోగం, పేదరికాన్ని తగ్గిం చడం, సంపద, ఆదాయ అసమానతలను తగ్గించడం, సబ్సిడీ తగ్గించుకొని కష్టజీవులపై ఎరువుల భారం మో పింది. ధరలను అదుపులో ఉంచడం, పన్ను వ్యవస్థను సం స్కరించడం చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటే బడ్జెట్‌ ఉసూరు మనిపించింది. ప్రధానంగా పేదలకు కూలి పను లు కల్పించే ఉపాధి చట్టానికి ఐదు శాతం నిధులు తగ్గిం చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యంతర బడ్జె ట్‌ ఆశించినంత ఆకర్షణీయంగా లేనప్పటికీ గతంతో పోలి స్తే మౌలిక సదుపాయాలు, తదితర రంగాలకు కేటాయిం పులు పెంచారు, మరికొన్ని రంగాలకు తగ్గించారు. 2023-24లో తెలంగాణకు పన్నుల వాటా కింద 23,400 కోట్లు కేటాయించగా. ఈ మధ్యంతర బడ్జెట్‌లో దీనికి మరో రూ.2,239 కోట్లు చేర్చారు. దీంతో బడ్జెట్‌ రూ. 25,639 కోట్లకు చేరింది. ఎన్నికల సంవత్సరం కావ డంతో బడ్జెట్‌ మొత్తం రూ. 47,65,768 కోట్లతో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా తెలంగాణకు రూ. 25, 639 కోట్లు కేటాయించారు. కొత్త పథకాలేవి లేవు. తెలం గాణకు కేటాయించిన బడ్జెట్‌ కూడా కేంద్ర పన్నుల వాటా కింద మాత్రమే ప్రకటించారు.ఇక రాష్ట్రానికి కేంద్ర ప్రాయో జిత పథకాల కింద రూ.19,760.59 కోట్లు వస్తాయి. ఇక మరో రూ.3200 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల మంజూరు కింద రానున్నాయి. ఈ మూడు మాత్ర మే పెద్దపద్దులు. తప్ప రాష్ట్రానికి చెప్పు కోదగిన కేటాయింపులు పెద్దగా లేవు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ కేంద్రం నుం చి ఎక్కువగానే ఆశించింది. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి – ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌కు ఆమోదం, వెన కబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద మూడేళ్లకు రూ. 1800 కోట్లు విడుదల చేయాలని కోరింది. దీంతో పాటు హైదరాబాద్‌- నాగపూర్‌ పారిశ్రామిక కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఒక వేళ దీనికి కనుక అనుమతులు ఇస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయని అంచనా వేశారు. దీంతోపాటు అదనంగా రూ.90 కోట్లు సైబర్‌ సెక్యూరిటీకి, మరో రూ. 88 కోట్లు యాంటీనార్కోటిక్‌ బ్యూరో పటిష్టతకు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు మూసి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి నిధులు మెట్రో రైలు రెండో దశకు నిధులు ఆశిం చారు. కానీ మధ్యంతర బడ్జెట్‌లో వీటి మీద ఎలాంటి ప్రస్తావన లేదు. కేంద్రం ఎలాంటి హామీ లివ్వలేదు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యం తర బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ.14 వేల 209 కోట్లు కేటాయించినట్లు. రైల్వే బడ్జెట్‌ విషయానికి వచ్చే సరికి తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు భద్రతా ప్రాజెక్టులకు రూ.5071 కోట్లు ఈసారి కేటాయిం చినట్లుగా కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే శాఖకు కేటాయింపుల్లో తెలంగాణకు ఊరట కలిగించే అంశాల్లేవు. నూతన రైల్వేలైన్లు, రైల్వే టెర్మినల్‌, డబ్లింగ్‌, భారీ ప్రాజెక్టు లేవీ అందించబడలేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి, పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించారు. గతేడాది రాష్ట్రా నికి ఇచ్చిన రూ.4,418 కోట్లతో ఈసారి దాదాపు 12.8 శాతం పెంచి రూ.5,071 కోట్లు కేటాయించారు. 2021- 22 బడ్జెట్లో రూ.2420కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రెండు సార్లు పెంచామని గుర్తు చేశారు. ఇప్పుడు 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ 109శాతం పెరిగిందని. అలా రూ.571 కోట్లు అని తెలిపారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారని చెబుతూనే రాష్ట్రంలో రైల్వే లకు పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని, తెలంగాణ లో వందశాతం విద్యుద్ధీకరణ పూర్తయ్యిందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం రెండు రాష్ట్రాలకు చాలా హామీలిచ్చింది. పదేండ్లయినా నేటికీ హామీలు అమలు కాలేదు. ఎన్నికల వేళ అని ఎదురుచూసినా వాటికి మోక్షం లభించలేదు. విభజన ప్రక్రియ అమలు విషయంలో కేం ద్రం తాత్సారం చేస్తోంది. ప్రత్యేక నిధులు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులకు చోటే లేదు. ఇది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
– తీగల అశోక్‌ కుమార్‌, 7989114086

Spread the love