మల్లారెడ్డికి మరో షాక్‌

మల్లారెడ్డికి మరో షాక్‌– చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ కూల్చివేత
నవతెలంగాణ-శామీర్‌పేట
మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్‌ తగిలింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం బొమ్మరసిపేట గ్రామ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను శుక్రవారం ఇరిగేషన్‌ అధికారులు కూల్చేశారు. వివరాల్లోకెళ్తే.. బొమ్మరాసిపేట రెవెన్యూ పరిధిలోని పెద్ద చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్‌ 317, 407, 408లో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ భూమిలో మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా ప్రికాస్ట్‌ వాల్‌ (ప్రహరీ గోడ) నిర్మించారు. దానిపై అధికారులకు గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో శుక్రవారం అధికారులు జేసీబీ సహాయంతో గోడను కూల్చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ అధికారులు, ఆర్‌ఐ కుమార్‌, డీఎల్‌పీఓ సాంబి రెడ్డి, ఎంపీఓ సునీత, పంచాయతీ కార్యదర్శిలు దేవేందర్‌ రావు, శ్రీనివాస్‌, విజరు కుమార్‌, బిల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.

Spread the love