నవతెలంగాణ-బొమ్మలరామారం
సీఎం కెసిఆర్ గత ఎన్నికల మేనిపెస్టో లోని వాగ్దానాలను అధికారంలో ఉండి ఎందుకు అమలు చేయలేదొ ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ పదేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ గత మేనిఫెస్టోలోని వాగ్దానాలు నేటికి ఎందుకు అమలు చేయలేదని అన్నారు. ఇప్పుడు కొత్త హామీలతో ప్రజల ను ఏమర్చాలని చూస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలుకు 10పదేండ్లుగా ఎదురుచూసిన ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కూలిపోయారని ఎమ్మెల్యేలకు జీతభత్యాలు పెంచడంపై ఉన్న చిత్తశుద్ధి ఉద్యోగులపై లేదని విమర్శించారు.ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బి ఆర్ స్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని అన్నారు.